Paris Olympics 2024

Paris Olympics 2024: చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్! గట్టెక్కిన భారత హాకీ టీమ్!

భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి-చిరాగ్ శెట్టి జోడీ చరిత్ర సృష్టించింది. ఈ జోడీ ఒలింపిక్ చరిత్రలో క్వారర్ట్స్ చేరిన తొలి భారతీయ డబుల్స్ జోడీగా నిలిచింది. Paris 2024 Olympics క్వార్టర్-ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా సాత్విక్-చిరాగ్ ఈ ఘనత సాధించారు.

 

జర్మనీకి చెందిన మర్క్-మెర్విన్‌తో సోమవారం జరగాల్సిన బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ మ్యాచ్ రద్దయింది. మోకాలి గాయం కారణంగా మార్క్ పోటీ నుండి వైదొలిగాడు. దీంతో నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేశారు.

 

ఫ్రెంచ్ జోడీ లాబార్-కోర్వీ 21-13, 13-10తో ఆర్టియాంటో-ఆల్పియన్(ఇండోనేషియా) చేతిలో ఓడి చాడ్విక్-చిరాక్ గ్రూప్ సి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ 21-19, 21.-14తో జూలియన్ (బెల్జియం)పై విజయం సాధించాడు.

Neeraj Chopra: నీరజ్ చోప్రాకు రజతం మిస్ అయిన స్వర్ణం
Neeraj Chopra: నీరజ్ చోప్రాకు రజతం మిస్ అయిన స్వర్ణం

 

మహిళల సింగిల్స్‌లోనూ పీవీ సింధు శుభారంభం చేసింది. హ్యాట్రిక్ పతకాలనే లక్ష్యంగా చేసుకుని సింధు తన మొదటి మ్యాచ్ ని ఘనంగా ప్రారంభించింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ group M తొలి మ్యాచ్‌లో తెలుగు తేజం పీవీ సింధు 21-9, 21-6తో మాల్దీవులకు చెందిన అబ్దుల్ రజాక్‌పై విజయం సాధించింది.

 

Paris Olympics 2024: భారత్ బలంగా ఉంది..

తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించిన భారత హాకీ జట్టు రెండో మ్యాచ్‌లో ఓటమి నుండి తప్పించుకుంది. సోమవారం గ్రూప్ ‘బి’లో అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 1-1తో డ్రా చేసుకుంది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (58వ నిమిషం) గోల్ చేసి ఓటమిని తప్పించాడు .

 

చరిత్ర సృష్టించిన Indian Hockey Team భారత్ ఖాతా లో మరో పతకం
చరిత్ర సృష్టించిన Indian Hockey Team భారత్ ఖాతా లో మరో పతకం

మ్యాచ్ ప్రారంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. తొలి క్వార్టర్‌లో ఇరు జట్లు గోల్‌ చేసేందుకు ప్రయత్నించినా విఫలమయ్యాయి. రెండో క్వార్టర్ ఆరంభంలోనే అర్జెంటీనా ఆటగాడు లుకాస్ మార్టినెజ్ 22వ నిమిషంలో గోల్‌తో గోల్‌ నమోదు చేశాడు. దీంతో భారత్‌కు సంక్షోభం ఏర్పడింది. గోల్ చేసి స్కోర్ సమం చేయడానికి ఎంతగానో ప్రయత్నం చేసింది.

 

ఓటమి అనివార్యమైన సమయంలో హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ చేశాడు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టు ఈసారి మరింత మెరుగ్గా పతకం సాధించాలనే తపనతో ఉంది. ఆరు జట్లతో కూడిన గ్రూప్-బిలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంటాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *