మహారాష్ట్రలో రూ.800 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. మహారాష్ట్రలోని భివాండిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగిన ఈ వ్యవహారాన్ని పోలీసులు వ్యూహాత్మకంగా పట్టుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) 720 కిలోల డ్రగ్ ‘మియావ్ మియావ్’ను స్వాధీనం చేసుకుంది. దాడిలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఏటీఎస్ బృందం 792 కిలోల లిక్విడ్ ఎంటీ డ్రగ్ ను స్వాధీనం చేసుకుంది.
గత కొన్నేళ్లుగా డ్రగ్స్ స్మగ్లింగ్‌పై నిఘా ఉంచిన ఏటీఎస్ అధికారులు పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎస్ బృందం చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా అనుమానితుడి నివాసంలో పెద్దఎత్తున డ్రగ్స్ ఉత్పత్తి అవుతున్నట్లు అందిన సమాచారం మేరకు నిఘా పెట్టారు. బివాండీ అపార్ట్‌మెంట్‌పై దాడి చేయగా, ఊహించిన దానికంటే ఎక్కువ డ్రగ్స్ దొరికాయి. మహారాష్ట్రలో ఇటీవలి కాలంలో జరిగిన అతిపెద్ద డ్రగ్స్ దందాలో ఇదొకటి. రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడడం ఇదే తొలిసారి.
ఈ ప్రాంతంలో అక్రమంగా డ్రగ్స్ ఉత్పత్తి, పంపిణీ జరుగుతోందని అధికారులు తెలిపారు. అరెస్టయిన వారు ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. ఇతర డ్రగ్స్ ముఠా సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరి ఇక్కడ తయారైన డ్రగ్స్ ఎక్కడికి పంపుతారు? వీరి నెట్‌వర్క్ వివరాలు తెలుసుకునేందుకు అధికారులు వారిని విచారిస్తున్నారు. గత కొన్నేళ్లుగా, ఈ నెట్‌వర్క్‌లను ఛేదించి నిందితులను చట్టం ముందుకు తీసుకురావడానికి అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. అయితే మెఫెడ్రోన్ అనేది యాంఫేటమిన్ మరియు కాథినోన్ క్లాస్‌లకు చెందిన సింథటిక్ ఉద్దీపన మందు. మెఫెడ్రోన్… డ్రోన్, ఎం-క్యాట్, వైట్ మ్యాజిక్, మియావ్ మియావ్, బబుల్ అని కూడా పిలుస్తారు.