చరిత్ర సృష్టించిన Indian Hockey Team భారత్ ఖాతా లో మరో పతకం

చరిత్ర సృష్టించిన Indian Hockey Team భారత్ ఖాతా లో మరో పతకం

ప్రతిష్టాత్మక పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం చేరింది. గురువారం (ఆగస్టు 08) జరిగిన కాంస్య పతక పోరులో భారత హాకీ జట్టు 2-1తో స్పెయిన్‌పై విజయం సాధించి కాంస్య పతకం సాధించింది. తాజా పతకంతో పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో 4కి చేరింది. వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ భారత్‌ కాంస్యం సాధించడం గమనార్హం. టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత్‌కు కాంస్య పతకం లభించింది. దాదాపు 47 ఏళ్ల తర్వాత Indian Hockey Team వరుసగా 2 ఒలింపిక్స్‌లో పతకాలు సాధించింది. మొత్తంమీద ఒలింపిక్స్‌లో హాకీ జట్టుకు ఇది 13వ పతకం. ఈ క్రమంలో ఈ టోర్నీ తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, స్పెయిన్ జట్లు గట్టి పోటీనిచ్చాయి. గోల్స్ చేసేందుకు ఇరు జట్లు పలుమార్లు గోల్ పోస్ట్‌ను తాకాయి. అయితే తొలి క్వార్టర్‌లో ఇరు జట్ల పటిష్ట డిఫెన్స్‌ కారణంగా గోల్‌ నమోదు కాలేదు.

 

Ind Vs SL: సిరీస్ ఓటమితో సోషల్ మీడియాలో గంభీర్ పై ట్రోల్స్
Ind Vs SL: సిరీస్ ఓటమితో సోషల్ మీడియాలో గంభీర్ పై ట్రోల్స్

అయితే రెండో క్వార్టర్ ఆరంభంలోనే స్పెయిన్ జట్టు తొలి గోల్ చేసింది. 18వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌తో మార్క్ మిరల్స్‌ గోల్ సాధించాడు. ఆ తర్వాత 20వ నిమిషంలో స్పెయిన్‌కు మరో పెనాల్టీ కార్నర్‌ లభించింది. కానీ అతను దానిని గోల్‌గా మార్చలేకపోయాడు. ఆట 29వ నిమిషంలో Indian Hockey Team కు పెనాల్టీ కార్నర్‌ అవకాశం లభించినా ఇక్కడ కూడా గోల్‌ నమోదు కాలేదు. ఆ తర్వాత ఆట చివరి నిమిషంలో భారత్‌కు మరో పెనాల్టీ కార్నర్ అవకాశం లభించింది. ఈసారి Indian Hockey Team కెప్టెన్ హర్మన్‌ప్రీత్ గోల్ చేసి మ్యాచ్‌ను 1-1తో సమం చేసింది.

పారిస్ ఒలింపిక్స్‌కు భారత ప్రయాణం చూదాం

పారిస్ ఒలింపిక్స్‌లో న్యూజిలాండ్‌ను 3-2తో ఓడించి Indian Hockey Team తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆపై అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. మూడో మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై భారత్ 2-0 తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత బెల్జియం చేతిలో 1-2 తేడాతో ఓటమి పాలైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాపై భారత్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది మరియు పెనాల్టీ షూటౌట్‌లో బ్రిటన్‌ను 4-2తో ఓడించింది. కానీ సెమీఫైనల్‌లో భారత జట్టు 2-3 తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు స్పెయిన్‌ను ఓడించి కాంస్యం సాధించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *