Devara ‘చుట్టమల్లే’ Song

Devara: మిలియన్ వ్యూస్ తో దేవర ‘చుట్టమల్లే’ సాంగ్ సెన్సేషన్

జూనియర్ ఎన్టీఆర్ Devara సినిమా కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేవర సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్ అభిమానులలో చాలా ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ క్రమంలో దేవరలోని రెండు పాటలు నెక్ట్స్ లెవల్ క్రేజ్ సంపాదించుకున్నాయి. అంతే కాకుండా విడుదలైన కొన్ని గంటల్లోనే పాటలు రికార్డులు సృష్టించడం గమనార్హం. ఇప్పుడు తాజాగా దేవర విడుదల అయిన ‘‘చుట్టమల్లే’’ పాటకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

NTR's emotional post about Mokshajna's entry!
మోక్షజ్ఞ ఎంట్రీ గురించి NTR ఎమోషనల్ పోస్ట్!

Devara చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఆ సినిమాలోని ‘‘చుట్టమల్లే’’ పాట. నెమ్మదిగా ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తారక్ నుంచి అభిమానులు ఎలాంటి లవ్ యాంగిల్‌ని ఆశిస్తున్నారో.. ఈ పాట కూడా అలాగే ఉంది.. తారక్ అభిమానులను ఈ పాట మరింత సంతోషపెట్టింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. ఈ పాట హుక్ స్టెప్పులతో మార్మోగుతోంది. అవి కూడా బాగా ట్రెండ్ అవుతాయి. దీంతో ‘‘చుట్టమల్లే’’ పాట ఏకంగా 75 మిలియన్ల వ్యూస్‌ను అధిగమించింది. థియేటర్లో విడుదల కాకముందే సంచలన రికార్డులు క్రియేట్ చేయవచ్చని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

 

News like a festival for Tarak fans. Devara trailer date has arrived
తారక్ ఫ్యాన్స్ కు పండగ లాంటి న్యూస్. దేవర ట్రైలర్ డేట్ వచ్చేసింది

దేవర 3వ పాటకు సంబంధించిన తాజా అప్‌డేట్.. మరింత ఆసక్తికరంగా మారింది. అదేంటంటే.. Devara ‘ఫియర్ సాంగ్’ పాట కంటే దేవర మూడో పాట ‘ఆయుధ పూజ’చాలా ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు. అలాగే ‘ఆయుధ పూజ’ పాట ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది అంటున్నారు. అందుకే ఈ పాట అప్‌డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. రోజురోజుకు సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి దేవర సెప్టెంబర్ 27న థియేటర్లలో ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూద్దాం. అలాగే ‘‘చుట్టమల్లే’’ పాట అప్‌డేట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో పంచుకోండి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *