మేడ్చల్ లో విషాదం జరిగింది. గౌడవెల్లి రైల్వే స్టేషన్లో రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. రాఘవేంద్రనగర్ కాలనీ చెందిన కృష్ణా రైల్వే డిపార్ట్మెంట్లోని లైన్మెన్. ఆదివారం సెలవు దినం కావడంతో తన ఇద్దరు కూతుళ్లు వర్షిణి, అమృతలను తీసుకుని రైలు పట్టాల పనులకు వెళ్లాడు. అతను అక్కడ పట్టాలపై పని చేస్తుండగా.. ఇద్దరు చిన్నారులు పట్టాలపై ఆడుకుంటున్నారు.
వేగంగా వస్తున్న రైలును చూసిన కృష్ణ వెంటనే పరుగులు తీసి పట్టాలపై ఆడుకుంటున్న తన ఇద్దరు కుమార్తెలను కాపాడాలి అని అటు వైపుగా పరుగులు తీసాడు. కానీ కృష్ణ, పిల్లలు వర్షిణి, అమృత రైలు ఢీకొని మృతి చెందారు. ఇది రెప్పపాటులో జరిగి ఓ కుటుంబం మృత్యువాత పడింది. ఆ కుటుంబంలో అంతులేని దుఃఖం నెలకొన్నది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.