నన్ను చంపడానికి ప్రయత్నాలు జరిగాయి:బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్

నన్ను చంపడానికి ప్రయత్నాలు జరిగాయి:బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని ముఠాలు అతడిని చంపేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్‌ని చంపడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్ దగ్గర లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అతన్ని చంపడానికి ప్రయత్నించింది. సల్మాన్ ఖాన్ భద్రతను కూడా ప్రభుత్వం పటిష్టం చేసింది.

 

లారెన్స్ బిష్ణోయ్ తనను, తన కుటుంబాన్ని చంపేందుకు ఇంటి బయట తుపాకీతో కాల్చాడని తాను నమ్ముతున్నానని సల్మాన్ ఖాన్ అన్నారు. గత నెలలో ముంబై క్రైమ్ బ్రాంచ్ యాంటీ ఎక్స్‌టార్షన్ సెల్ సల్మాన్ ఖాన్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. 1,735 పేజీల ఛార్జిషీట్‌లో, సల్మాన్ ఖాన్ తనకు మరియు అతని కుటుంబానికి లారెన్స్ బిష్ణోయ్ మరియు అతని ముఠా సభ్యుల నుండి వచ్చిన బెదిరింపుల వివరాలను తెలియజేసారు. కుటుంబ సభ్యులు, బంధువులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏప్రిల్ 14 తెల్లవారుజామున తాను నిద్రిస్తున్న సమయంలో షూటింగ్ జరిగిందని సల్మాన్ వెల్లడించాడు.

NTR's emotional post about Mokshajna's entry!
మోక్షజ్ఞ ఎంట్రీ గురించి NTR ఎమోషనల్ పోస్ట్!

 

తన కుటుంబ సభ్యులు, బంధువులు అప్రమత్తంగా ఉండాలని తాను ఎప్పుడూ కోరుతున్నానని, ముంబై పోలీసులు తనకు వై ప్లస్ భద్రత కల్పించారని సల్మాన్ తెలిపారు. ఏప్రిల్ 14న సల్మాన్ ఖాన్ ఇంటి బయట బైక్‌లపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. షూటింగ్ లో పాల్గొన్న విక్కీ గుప్తా, సాగర్ పాల్ లను గుజరాత్ లో అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేయగా, వారిలో ఒకరైన అనుజ్ తపన్ మే 1న పోలీసు కస్టడీలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

 

News like a festival for Tarak fans. Devara trailer date has arrived
తారక్ ఫ్యాన్స్ కు పండగ లాంటి న్యూస్. దేవర ట్రైలర్ డేట్ వచ్చేసింది

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై ఐదుగురిపై ముంబై పోలీసులు 1500 పేజీల చార్జ్ షీట్ దాఖలు చేశారు. నటుడిని చంపేందుకు రూ. 25 లక్షల డీల్‌తో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లోని నేరగాళ్లు అతడిని హతమార్చేందుకు ఆధునిక ఆయుధాలు కొనుగోలు చేయాలని కూడా ప్లాన్ చేశారు. కాల్పుల ఘటనకు సంబంధించి లారెన్స్ బిష్ణోయ్, అతని సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ సహా 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలులో ఉన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *