ఏపి లో స్థానిక ఎన్నికల నగారా మోగిన వెంటనే విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి, ఎన్నికల్లో తమ అభ్యర్థిత్వం కోసం పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆశావహులు బిజీ బిజీ గా గడుపుతున్నారు. ఎన్నికల ప్రచారానికి కాదేది అనర్హం అనుకున్నారేమో టికెట్స్ కోసం ప్రయత్నిస్తూనే సోషల్ మీడియా ప్రచారాలు, స్థానికంగా జరిగే కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ తమ అభ్యర్థిత్వం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ విచిత్ర పరిణామాలు చూసిన ప్రజలు ఎప్పుడు ప్రజల్లో కనిపించని, టీవీ లో, సోషల్ మీడియా లో మాత్రమే చూస్తున్న కొంతమంది నాయకుల గురించి తమకు తోచిన విధంగా స్పందిస్తున్నారు, మరికొంత మంది వ్యంగంగా ఛలోక్తులు విసురుతున్నారు. ఏదేమైనా ఈ ఎన్నికల్లో ప్రజలకు దూరంగా ఉండే నాయకులని కాకుండా ప్రజల్లో, ప్రజల కోసం జీవించే నాయకులను గెలిపించాలని మీ నేటివార్త కోరుకుంటోంది

