తెలంగాణలో రేపటి (జూలై 18) నుంచి DSC పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో DSC నోటిఫికేషన్ ద్వారా 11,062 పోస్టులు విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిందే. రేపటి నుంచి ఈ పోస్టులకు ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ విద్యాశాఖ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు జరుగుతాయి. గత కొన్ని రోజులుగా టెట్, డీఎస్సీ ప్రిపరేషన్ సమయం సరిపోకపోవడంతో వాయిదా వేయాలని అభ్యర్థులు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపటి నుంచి రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి.
రాష్ట్రంలో 11,062 పోస్టుల భర్తీకి 2.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అలాగే ఈ ఏడాది తొలిసారిగా DSC పరీక్షలును ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు జూలై 18 నుంచి ప్రారంభమై ఆగస్టు 5 వరకు జరుగుతాయి. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఈ నెల 11న విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థుల DSC Hall Tickets అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచబడ్డాయి. నిన్న(మంగళవారం) సాయంత్రం నాటికి 2,40,727 మంది హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.
DSC పరీక్షలు రోజుకు రెండు షిఫ్టుల్లో జరుగుతాయని, తెలంగాణ వ్యాప్తంగా 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. DSC Hall Tickets లో చాల తప్పులు ఉన్నాయి అని విద్యార్థులు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేయడంతో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ తప్పులను గుర్తించి, వాటిని సరిదిద్ది మల్లి ఆన్లైన్ లో అందరికి అందుబాటులో ఉంచుతాము అని విద్యాశాఖ తెలియజేసారు.