AP ప్రభుత్యానికి వెంకయ్య సూచనలు చంద్రబాబు అమలు చేస్తారా?

AP ప్రభుత్యానికి వెంకయ్య సూచనలు చంద్రబాబు అమలు చేస్తారా?

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పైన వ్యాఖ్యలు కీలక చేశారు. నాయకులు పోలీస్ స్టేషన్లు, రెవెన్యూ కార్యాలయాల కంటే పెత్తనం అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. కాగా, ఉచిత పథకాలపై వెంకయ్య కీలక సలహా ఇచ్చారు. ప్రజా జీవితంలో ఆదర్శాలు, విలువలు, సంప్రదాయాలను గౌరవించాలని మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రజాప్రతినిధులకు సూచించారు. చిన్నప్పటి నుంచి కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చినా వాటిని అవకాశాలుగా మలుచుకుని ముందడుగు వేశానని వెంకయ్యనాయుడు అన్నారు. తన చిన్నతనంలోనే తల్లి చనిపోయిందని అది తప్ప తనకు జీవితంలో ఇంకా వేరే లోటు ఏమి లేదు అని అయన వ్యక్తం చేసారు. లాయర్ కావాలనే తన తల్లి కోరిక మేరకు న్యాయశాస్త్రం చదివానన్నారు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కారణంగా తాను జైలుకు వెళ్లి న్యాయవాద వృత్తిని కొనసాగించలేకపోయానన్నారు.

ప్రజాప్రతినిధులలో మార్పు రావాలని,

ప్రజాప్రతినిధుల ఆలోచనా విధానంలో మార్పు రావాలని, అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు మంచి భాష మాట్లాడాలని సూచించారు. రాజ్యసభ స్పీకర్‌ను సవాల్‌ చేసిన కొందరు సభ్యుల తీరుపై ఆయన ఎమోషనల్‌గా స్పందించారు. సంప్రదాయాలు మరియు ఉత్తమ సంస్కారం అందరికి అవసరం అని, రాష్ట్రంలో ఆ పద్దతి పాటించని వారికి గత ఎన్నికల్లో కూడా గుణపాఠం నేర్చుకున్నారు అని అయన గుర్తు చేసారు. పార్టీలు వేరైనప్పటికీ ప్రత్యర్థులు కానీ బద్ద శత్రువులము కాదు భావన ఉండాలి అన్నారు.

Despite the presence of the police, the drug lords could not be controlled
పోలీసులు ఉన్నప్పటికీ మందు బాబులను అదుపు చేయలేకపోయారు

ఉచితంగా ఇవ్వనప్పటికీ

ప్రజలకు ఉచిత వైద్యం, విద్య అందిస్తే చాలని వెంకయ్యనాయుడు అన్నారు. మిగిలినవి ఉచితంగా ఇవ్వకుంటే ఇబ్బంది లేదన్నారు. అలా చేస్తే దేశం, రాష్ట్రాలు బాగుపడతాయన్నారు. పధకాలను ఉచిత అందించే బదులు, ప్రజలకు ఉద్యోగంపై శిక్షణ ఇవ్వాలని ఆయన వివరించారు. దీంతో వారికి ఉపాధి లభిస్తుందని వెంకయ్యనాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత పథకాలపై ఎన్నికల వాగ్దానాలు..ఇక సంకీర్ణ పాలన అమలుపై చర్చలు జరుగుతున్న వేళ, చంద్రబాబు పాలనలో వెంకయ్య అభిప్రాయం ఎలా ఫలిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

పవన్ కల్యాణ్ రాకతో పిఠాపురంలో రియల్ ఎస్టేట్ కి రెక్కలు
Pawan Kalyan రాకతో పిఠాపురంలో రియల్ ఎస్టేట్ కి రెక్కలు
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *