జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. నిజానికి పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేసి సొంత ఇల్లు కొనుక్కోవడంతో అక్కడ స్థలం ధరలు నాలుగు రెట్లు పెరిగింది. గతంలో ఆడ పిల్ల పెళ్ళి చేయాలి అంటే నాలుగు ఎకరాలు భూమి అమ్మవాల్సి వచ్చేది కానీ ఇప్పుడు Pawan Kalyan పిఠాపురం మకాం మార్చడం వాళ్ళ భూమి ధరలకు రెక్కలు వచ్చాయి. ఇప్పుడు అర ఎకరం అమ్మితే చాలు ఆడ పిల్ల పెళ్ళి జరిగిపోతుంది అని అక్కడి భూ యజమానులు చెబుతున్నారు. ప్రస్తుతం పిఠాపురం రియల్ ఎస్టేట్ రంగం కూడా పుంజుకుంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి గెలవడం తో ఇప్పుడు ఆ టాపిక్ రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. పిఠాపురం పర్యాటక కేంద్రంగా మారుతుందని అందరూ అంచనా వేస్తున్నారు.
పిఠాపురం నుండి Pawan Kalyan ఎప్పుడు అయితే పోటీ చేయాలి అనుకున్నాడో అప్పటి నుండి పిఠాపురంకి క్రేజ్ బాగా పెరిగింది. పవన్ కళ్యాణ్ అక్కడ ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన స్థలాన్ని కొనుగోలు చేయడంతో, అప్పటి నుండి అక్కడ స్థలం ధరలు కూడా పెరిగాయి. ఒకరకంగా చూసుకుంటే విజయవాడలో ఉన్న భూముల ధరలతో పోటాపోటీగా ఉన్నాయి అనడంలో ఆశ్చర్యం లేదు. బిల్డర్లు కూడా సిద్ధంగా ఉన్నారు. అపార్ట్‌మెంట్లు నిర్మించి డబ్బు సంపాదించడానికి సిద్ధంగా ఉన్నారు. పిఠాపురంలో హోటళ్లు, లాడ్జీలు నిర్మాణాలు కూడా బాగా పెరిగాయి. గతంలో లేని సౌకర్యాలు కల్పిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో రామ్‌చరణ్ అపోలో ఆస్పత్రిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పిఠాపురంలో అపోలో ఆస్పత్రి నిర్మాణానికి సర్వం సిద్ధమైనది. ఆస్పత్రి కోసం రామ్ చరణ్ కూడా పిఠాపురంలో పదెకరాల భూమి కొన్నాడు. ఈ భూమిలో అపోలో ఆసుపత్రి నిర్మించనున్నారు. ఎన్నో ప్రత్యేక సదుపాయాలతో ఈ ఆసుపత్రిని నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి నాయుడు తెలిపారు. పిఠాపురంలో అపోలో ఆసుపత్రి రావడం వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని, మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఈ ప్రాంత ప్రజలు విశ్వసిస్తున్నారు.
పిఠాపురంలో అపోలో ఆసుపత్రి నిర్మిస్తే సమీపంలోని ప్రజలకు కూడా వైద్యం అందుతుంది. దీంతో పిఠాపురం దశ మారనుందని సమాచారం. కాకినాడ సిటీ మాదిరిగా పిఠాపురం మారే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. పిఠాపురం నుండి జనసేన అధినేత Pawan Kalyan భారీ మెజారిటీతో గెలుపొందారు కాబట్టి అక్కడ అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని పిఠాపురం ప్రజలు కోరుకుంటున్నారు.