తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముమ్మరంగా పర్యటిస్తూ సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. బాపట్ల, గుంటూరు జిల్లాల్లో పర్యటించి తుఫాన్ నష్టాన్ని పరిశీలించారు. రైతులు, స్థానికులతో మాట్లాడిన ఆయన మీకు నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు. దెబ్బతిన్న రోడ్లను పరిశీలించి మరమత్తులు త్వరితగతిన చేపట్టి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో పంట పాడవకుండా పట్టిసీమ నీటితో పంట రక్షణకు చర్యలు తీసుకున్నా తుఫాను వల్ల పంటలు పాడవటం ఎంతో కలిచివేసిందన్నారు.
తుఫాన్ నష్టాన్ని ఎవరు ఆపలేరు, బాధితులకు సహాయాన్ని అందజేసి కోలుకునేలా చేస్తామని భరోసా ఇచ్చారు. ఇన్ ఫుట్ సబ్సిడీ తో చిట్టచివరి బాధితునికి కూడా సహాయం అందేలా చేస్తానని తెలిపారు.
