ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి అవకతవకలకు పాల్పడుతున్నారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి విమర్శించారు. పులివెందుల చేజారడంతో జగన్ అవకతవకలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వైకాప నాయకులు భయబ్రాంతులకు గురిచేశారని, టీడీపీ వర్కర్స్ పై దాడి చేసి అక్కడి వాతావరణాన్ని అశాంతియుతంగా మార్చారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆరోపణలు చేసారు.
ఎలక్షన్స్ లో జరిగిన అవకతవకలమీద గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే గళ్ళా నసీర్ తో కలసి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసారు.
