రష్మిక హిందీ యాసపై సామజిక మాధ్యమాల్లో జరుగుతున్న ట్రోలింగ్ గురించి మాట్లాడారు. నేను దక్షిణాదికి చెందిన దానిని, నా యాస కూడా దక్షిణాదిలాగానే ఉంటుంది, అలాంటప్పుడు నా సహజమైన యాసను తప్పుగా ట్రోల్ చేయడం సరికాదన్నారు.
రష్మిక మీద జరుగుతున్న ట్రోలింగ్ ను రచయిత జావేద్ అక్తర్, హీరోయిన్ మధు బాల ఖండించారు. నటి మధుబాల ఇన్స్టా ద్వారా రష్మికకు మద్దతుగా ఒక వీడియోను షేర్ చేసారు. రష్మిక నువ్వు ట్రోలింగ్ ని ఎదుర్కున్న తీరు హుందాగా ఉంది, ఇలానే ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలని అని అన్నారు.
