సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న పవర్ పేట సినిమాలో రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తున్నారు. 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్ల, శశి దేవిరెడ్డి ఈ నిర్మాణం చేపట్టారు.
చిత్ర యూనిట్ రితిక నాయక్ పుట్టిన రోజు సందర్భంగా పవర్ పేట లోని పడమట వీధి జానకి స్టిల్స్ ను రిలీజ్ చేసారు. ఈ చిత్రంలో రితిక నాయక్ రోల్ ఫొటోస్ చూసిన కుర్రకారు ఖంగు తిన్నారు, ఈ స్టిల్స్ ఇప్పుడు ట్రేండింగ్ లోకి వచ్చాయి. ప్రేమ, గౌరవం, రాజకీయం కధాంశంగా ఈ చిత్రం రూపుదిద్దుకొంటోంది, ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ 60 శాతం పూర్తిచేసుకుంది. ఈ స్టిల్స్ చూసిన ప్రేక్షకులు సినిమా సూపర్ హిట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
