ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వైకాపా జగన్ గురించి చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. చంద్రబాబు జగన్ గురించి మాట్లాడుతూ జగన్ ఎక్కడుంటే అక్కడ సంక్షోభమేనని, జగన్ ను విమర్శించడంలేదంటూ కొన్ని వివరణలు ఇచ్చారు.
* వై ఎస్ వివేకానందరెడ్డి కుటుంబంలో సంక్షభం
* ఆంధ్రలో ఐదేళ్ల పాటు సంక్షోభం
* సొంత కుటుంబంలోనే సంక్షభం
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత ఆ కుటుంబానికి విజయమ్మ పెద్ద దిక్కు, ఆవిడ చెప్పినట్టు వినాలి, తండ్రి సంపాదించిన ఆస్తిలో చెల్లలు షర్మిల కి వాటా ఇవ్వడానికి ఇష్టపడని వాడు, తల్లి చెప్పిన విననివాడు ఇంకెవరిమాట వింటాడు అంటూ జగన్ పై చంద్రబాబు చలోక్తులు విసిరారు.
రాష్ట్రంలో పేటీఎం బ్యాచ్లు జగన్ ఏమి చేసిన, రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న పర్వాలేదు అనుకుంటూ జగన్ భజన చేస్తున్నారని చంద్రబాబు చురకలంటించారు. జగన్ పోరాటాలు, ఆలోచనలు అన్ని తన ప్యాలెస్లు, ఆస్తులు కాపాడుకోవటంకోసమేనని, పేదప్రజలకు కోసం కాదని అన్నారు.
