గుంటూరు ఆత్మగోష | గుంటూరు కాదయ్యా గుంతలూరు | నా సమస్యలు పట్టించుకోండయ్యా | netivartha.com
గుంటూరు అంటే రాజధానికి అతిదెగ్గర ప్రాంతం, జంట నగరాల్లో ఒకటి, దేశం గర్వించదగ్గ నాయకులు నడిచిన నేల, ఇది నాణానికి ఒకవైపు మరోవైపు ఏంటో తెలుసా? వసుతల లేమి, ఎక్కడ చూసిన సగం సగం పనులు, గుంతల రోడ్లు, వర్షాలు పడితే మునిపోయే కాలనీలు, రోడ్లు లేని శివారు కాలనీలు, నల్లపాడు వాగు పొంగితే నగరానికి స్విమ్మింగ్ పూల్స్ లాగా ఈత కొట్టగలిగే ప్రాంతాలు, మరోప్రాంతం లో మురుగునీరు పోయే దారిలేక ప్రజల ఇల్లు మునక, దాహార్తితో అలమటించే శివారు నగర ప్రజలు ఇవి గుంటూరుకి మరోవైపు.
గుంటూరు ప్రజలు మా సమస్యలు ఎవరు పరిష్కరిస్తారా అంటూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు, గుంటూరు నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది వాస్తవం, కానీ ఒకేసారి అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టడం, అవి అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు దాని ఫలాలు అందుకోలేకపోయారు, గుంటూరు నగరం లో కొన్ని ప్రాంతాలకే అభివృద్ధి అనేది పరిమితమయింది అనే నిట్టూర్పులు వినిపిస్తున్నాయి , నగర శివార్లు అత్యంత దయనీయమైన స్థితిలోకి వెళ్లిపోతున్నాయి.
అభివృద్ధి ఫలాలు అనేది ధనిక, పేద ఇరువురు అనుభవించినప్పుడే దాని సార్ధకత, మరి చూద్దాం గుంటూరు భవిష్యత్తు ఎప్పుడు మారుతుందో.

