సరస్ మేళ 2026 | దసరా సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనం | సరస్ మేళ 2026 షాపింగ్ | డిప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణ రాజు | Netivartha.com
దసరా సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం అనంతరం విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రారంభించిన జాతీయ సరస్ మేళా – 2026 (National SARAS Mela) ను ఆయన సందర్శించారు, అనంతరం అధికారులతో మాట్లాడుతూ ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా సరస్ మేళ ను విజయవంతం చేయాలనీ ఆయన కోరారు. అనంతరం సరస్ మేళ మొత్తం తిరుగుతూ ఎగ్జిబిషన్ స్టాల్స్ను పరిశీలించారు, వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకొని వాటిని పరిష్కరించాలి అని అధికారులకు తెలిపారు.
సరస్ మేళాలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత ఉత్పత్తులు, సంప్రదాయ కళాకృతులు, వివిధ రకాల ఆహార ఉత్పత్తులను తిలకించారు. మహిళల ప్రతిభను ప్రోత్సహిస్తూ, వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్న ఈ జాతీయ సరస్ మేళా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని శ్రీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.
విజయవాడ నందు జరుగుతున్నా సరస్ మేళ ఎంతో ప్రేత్యేకమైనదని దసరా సందర్భంగా అమ్మవారి దర్శనము చేసుకొని సరస్ మేళాలో ప్రజలు పాల్గొంటున్నారని ఆయన తెలిపారు, ఇలాంటి సదవకాశాన్ని అందరు వినియోగించుకొని మహిళలను ప్రోత్సహించాలని రఘురామ కృష రాజు ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

