మహేంద్ర సింగ్ ధోని మిస్టర్ కూల్ కాదు.. నరకం చూపిస్తాడు! | Chef Sangwan | Netivartha.com
మహేంద్ర సింగ్ ధోని, ఈ పేరు తెలియని భారతీయుడు ఉండదంటే అతిశయోక్తి కాదు, సుమారు 10 సంవత్సరాలు టీం ఇండియా కెప్టెన్ గా సత్తా చాటాడు, ఇండియాను అగ్రపధాన చేర్చాడు. ఇప్పుడు చెఫ్ సంగ్వాన్ చేసిన వ్యాఖ్యలు ధోనిని మిస్టర్ కూల్ అనే భావన తుడిచివేసింది.
ధోని కి చెఫ్ సంగ్వాన్ చాలాసార్లు వండిపెట్టానని, ఎప్పుడైనా అతని ఫుడ్ లో కొంచం సాల్ట్ ఎక్కువైనా మిస్టర్ కూల్ లోనుండి ఇంకొక వ్యక్తి బయటకు వచ్చి నరకం చూపిస్తాడని సరదాగా అన్నారు, ఈ తప్పు మళ్ళి జరగకూడదని, ఎప్పుడు కూడా హోటల్ యాజమాన్యానికి కంప్లైంట్ చేయండని ఇంకొకసారి చేయద్దని బాగా క్లాస్ పీకుతాడని అన్నారు.
ధోని కి టిఫిన్ లో దోస, చిల్లి చీజ్ తోఆస్ట్, లంచ్ లో బట్టర్ చికెన్, పాస్తా, ఫిష్ కర్రీ బాగా ఇస్తామని తెలిపారు, వీటితోపాటు ఎక్కడకి వెళ్లినా లోకల్ ఫుడ్ అడిగిమరి తింటాడని అన్నారు.

