పొన్నూరు మండలం, కొట్టపాలెం గ్రామానికి చెందిన తాడిశెట్టి తిరుపతమ్మ 2024వ సంవత్సరంలో భర్త చనిపోవడంతో పెన్షన్ కి వితంతు పెన్షన్ కి అప్లై చేసారు, కానీ ఆ సమయంలో ఎన్నికల కోడ్ ఉండటంతో పెన్షన్ శాంక్షన్ చేయడంలో చాలా లేట్ అయ్యింది, దీనిపై తిరుపతమ్మ హై కోర్ట్ ను ఆశ్రయించారు, హై కోర్ట్ జ్యోక్యంతో తిరుపతమ్మకు 2026 ఫిబ్రవని నుండి పెన్షన్ ఇవ్వడం ప్రారంభించారు, కానీ తిరుపతమ్మ పెన్షన్ అప్లై చేసిన నాటి నుండి పెన్షన్ బకాయిలు ఇప్పించాలని కోరారు, దీనికి ప్రభుత్వ తరుపు న్యాయవాదులు ఇది ప్రభుత్వ విధానానికి విరుద్ధమన్నారు.
తిరుపతమ్మ, ప్రభుత్వ న్యాయవాదుల వాదనలు విన్న న్యాయస్థానం పింఛను కోసం దరఖాస్తు వచ్చిన 21 పనిదినాల్లో పరిష్కరించాలని ప్రభుత్వం నిర్దేశించింది, స్పందించని అధికారులు ఇతర కారణాలు చెప్పడానికి వీల్లేదు, 2024 తిరుపతమ్మ వితంతు పెన్షన్ కి అప్లై చేసిన నాటి నుండి బకాయిలు చెల్లించాలని కోర్ట్ పేర్కొంది.
ఈ తీర్పుతో ఇప్పటికే పెన్షన్స్ అప్లై చేసుకొని స్థానిక ఎన్నికల నేపథ్యంలో పెన్షన్స్ అందని వారికీ ఈ తీర్పు వల్ల పెన్షన్ బకాయిలు కలిపి ఇస్తారో లేదా చూడాలి, ప్రభుత్వ నిర్ణయం కోసం వేచిఉండాలి.

