జడ్పీటీసీ ఎన్నికల్లో గుడిపాల మండలం, చిత్తూరు జిల్లా నుండి పోటీ చేస్తున్న మమత శ్రీ ఆస్తులు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మమత శ్రీ, కుటుంబ సభ్యుల పేరిట మొత్తం రూ. 172.27 కోట్ల రూపాయలుగా అఫిడవిట్ లో తెలిపారు. ఇందులో 9.28 కోట్లు చరాస్తి కాగా, రూ. 162.99 కోట్లు స్థిరాస్తులు. మమత శ్రీ పేరిట 1.10 కిలోల బంగారం, 15 కిలోల వెండి కూడా ఉన్నాయి.
మమత శ్రీ భర్త మొగిలీశ్వరనాయుడు (ఈశ్వర నాయుడు) పేరిట ట్రక్కులు, కాంక్రీట్ మిక్సర్ ట్రక్కులు ఉన్నాయి. ఈశ్వర నాయుడు పేరిట మొత్తం 119.80 కోట్లు, మమత శ్రీ పేరిట 43.64 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇందులో వ్యవసాయ భూములు, విలువైన ఇల్లు కూడా ఉన్నాయి.
మమత శ్రీ ఆమె భర్త ఈశ్వర నాయుడుకు చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం, కర్ణాకటలో ఈ ఆస్తులు ఉన్నాయి. బంగారుపాళ్యం మండలానికి చెందిన మమత శ్రీ గుడిపాల నుంచి జడ్పీటీసీ గా తెలుగు దేశం పార్టీ తరుపున నామినేషన్ వేశారు.
