కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి చూస్తే చాలు అనుకునే భక్తులు ఉంటారు, ఆ శ్రీనివాసుని రోజుకొక్క సారైనా తలుచుకోకుండా ఉండని భక్తులు అసలు ఉండరు. అలాంటి భక్తులు చాలామంది రోజు స్మరించే ఆ శ్రీనివాసుని మంత్రం ఇదే. ఈ మంత్రాన్ని ప్రతిరోజు స్మరించని వారు కూడా శనివారం తప్పకుండ స్మరించుకుంటారు.
ఓం నమో వేంకటేశాయ కామితార్థ ప్రదాయినే
ప్రణతః క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః
ఈ మంత్రం అర్ధం మీరు తప్పకుండా తెలుసుకోండి.
ఓం - పరబ్రహ్మ స్వరూపమైన ఎంతో పవిత్రమైన ప్రణవ నాదం.
నమో - శరణాగతి
వెంకటేశాయ - తిరుమల కొండపై కొలువైన శ్రీనివాసునికి
కామితార్ద ప్రదాయినే - భక్తుల సముచితమైన కోరికలను నెరవేర్చే స్వామికి
ప్రణతః - భక్తి శ్రద్ధలతో శరణు కోరిన వారికి
క్లేశ నాశాయ - భాధలు, కష్టాలు, మనోవేదనలు తొలగించే స్వామికి
గోవిందాయ - గోవిందుడైన శ్రీ మహావిష్ణువుకు
నమో నమః - నమస్కరములు
గోవిందా అని శరణు కోరిన భక్తుల కోరికలను నెరేవేర్చే భక్తుల కష్టాలను తొలగించే గోవిందుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి పదే పదే నమస్కరిస్తున్నాను అని అర్ధం.
